Kick
17
June
Posted by Durga Ramesh
"అరుంధతి"
..."కిక్" ఒకే ఇయర్ రిలీజ్ అయ్యాయి ...రెండు పెద్ద హిట్స్ ..."అరుంధతి" లో కధ,కదన వేగం ,గ్రాఫిక్స్ వుంటే ..."కిక్" లో క్యారెక్టర్ వుంది ..దాని చుట్టూ అల్లిన మంచి "కిక్" ఇచ్చే కధ వుంది .... రవితేజ కి, సురేందర్ రెడ్డి కి, వక్కంతం వంశీ కి
పేరుతెచ్చిన చిత్రం ... ఎప్పుడు చూసినా సరదాగా చూడబుద్ది అయ్యే సినిమా ...
"కిక్" ... ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ గురించి చూద్దాము .. .
-------ok—coming to the main points -----------
Script main points :
1.కేవలం క్యారెక్టర్ మీద బేస్ అయ్యి కధ అల్లి పెద్ద హిట్
కొట్టారు ... మనం చూసిన "ఆర్య" "మిస్టర్ పర్ఫెక్ట్" ", మన్మధుడు", .. ఈ కోవకు చెందిన
సబ్జక్ట్స్ ... ఇటువంటివి ప్రేక్షకులను బాగా అలరిస్తాయి .. ఎందుకంటే "మనకు
కుడా ఇలా ప్రవర్తించాలని వుంటుంది" ... కానీ ప్రవర్తించలేము ... అందువలన ఆ
క్యారెక్టర్ నచ్చుతుంది .. దానితో ట్రావెల్ చేయడం మొదలు పెడతాము ... ఆ క్యారెక్టర్
బాధ పడితే బాధ పడతాము ... కామెడీ చేస్తే ఎంజాయ్ చేస్తాము .. క్యారెక్టర్
చిక్కుల్లో పడితే టెన్షన్ పడతాము .... అంటే క్యారెక్టర్ ని సరిగ్గా సృష్టించి ..
దాన్ని ఒక సారి ప్రేక్షకుడు ఇష్టపడేలా చేస్తే ... సినిమా అయ్యేవరకు ఆ క్యారెక్టర్
.. తనది గా ఫీల్ అవుతాడు ... సో హిట్ గ్యారంటీ .... ఇదే ఇలాంటి సినిమాలకు లాజిక్
... ఆ క్యారెక్టర్ అలా ప్రవర్తించడానికి రీజన్స్ కరెక్ట్ గా వుండాలి ... ఎందుకంటే “ ఏ క్యారెక్టర్ అయినా అలా సడన్ గా ప్రవర్థించదు కదా!” .. అలా ప్రవర్తించడానికి రీజన్స్ ఉండాల్సిందే .. .ఇది
ఉన్నంత మాత్రాన సరిపోదు .. సినిమా స్ట్రక్చర్, సీన్, డ్రైవ్ లు, స్క్రీన్ ప్లే
అన్నీ బాగుండాలి ...
2. సంఘర్షణ (Conflict)అనేది ఏ కధ కయినా
ప్రాణం లాంటిది .. ఎందుకంటే సంఘర్షణ లోంచి "డ్రామా" వస్తుంది కాబట్టి
... ఈ సినిమాలో రెండు Conflictలు వున్నాయి ...
1 ఇలియానా -.
రవితేజ "ప్రేమ"
2 శ్యాం -. రవితేజ మధ్య వున్న ప్రొఫెషనల్ వార్ ... ఈ రెండు
కాన్ఫ్లిక్ట్ లు తీరిపోవడమే సినిమా .. హీరో ని ఇబ్బంది పెట్టేదే కాన్ఫ్లిక్ట్ ...
"కిక్" కోసం ప్రయత్నించే రవితేజా - ఇలియానా వలన ఇబ్బంది పడతాడు ...
దాన్నించి బయటపడటం కోసం రవితేజ ఇలియానా కి దూరం అవుతాడు ... ఇలియానా కుడా రవితేజా వలన, ప్రేమ వలన ఇబ్బంది
పడుతుంది… అలాగే "కిక్" కోసం దొంగగా మారి - పోలీస్ శ్యాం
తో ఇబ్బంది పెడతాడు .. శ్యాం రవితేజాని పట్టుకోవాలి ... ఇలా కాన్ఫ్లిక్ట్ లు
కలగలిసి సినిమా ను ఆసక్తిగా మలుస్తాయి ... ఆటోమేటిక్ గా “డ్రామా” వస్తుంది ..ఈ రెండిటికి లింక్ స్టార్టింగ్ పెళ్ళిచూపులతో ఏర్పరిచాడు
... కాబట్టి ప్లే ఇంటరెస్టింగ్ గా సాగింది ...
3. ప్రధాన పాత్ర కు
ఏ లక్ష్యం లేకుండా వుండి ... సినిమా జరుగుతూ ... చివరకు ఒక ఉన్నత లక్ష్యం సాధిస్తే
ఆ సినిమా లో ఆ ప్రధాన పాత్ర ని ప్రేక్షకుడు ఇష్ట పడతాడు ... జీరో టు హీరో
కాన్సెప్ట్ ... అయితే ఆ లక్ష్యం కోసం హీరో చేసే పోరాటం, విధానం, జరిగే ఘర్షణ
ఎంతగా మెప్పిస్తే. అంత హిట్ అవుతుంది ....
అల్లరి చిల్లరగా వున్న రవితేజా క్యారెక్టర్ దొంగగా మారుతుంది ... ఫస్ట్ హాఫ్
లో ఇది ఒక సస్పెన్సు పాయింట్ ... రవితేజ ఎందుకు దొంగ గా మారాడు? అనేది
ప్రేక్షకుడిని ఆలోచింపచేస్తుంది .... అయితే సెకండ్ హాఫ్ ఓపెన్ అవుతున్న కొద్దీ ఆ
విషయం ఫ్లాష్ బ్యాక్ ద్వారా తెలియడం తో ఆ సస్పెన్సు విడిపోతుంది ... ఇదే ప్లే
"జెంటిల్ మాన్" లోకూడా వుంటుంది ... రవితేజా ఒక మంచి పని కోసం మారడం -
అక్కడ “కిక్” దొరికింది కాబట్టి
చేస్తున్నన్నాడని చెప్పడం బాగుంది .. ఇది ప్రేక్షకుడి కి నచ్చుతుంది ... ఎందుకంటే
తను కొట్టేసే డబ్బు రాజకీయనాయకులది ... పెద్దవాల్లది ... కాబట్టి సామాన్యుడు ఏమి
ఫీల్ అవ్వడు ... కానీ సామజిక ఉపయోగం వుంటే మెచ్చుతాడు ...
4.Opposite force : సినిమా లో హీరో క్యారెక్టర్
కి తగిన విధం గా ఆపొసిట్ ఫోర్సు ఉండేలా చూసుకుంటారు ... దానివలన ఆక్షన్ తో సినిమా
ని రన్ చేయవచ్చు ...దొంగ కి పోలీస్ .. రాజకీయనాయకుడి కి మీడియా ... నేరం +
కుంభకోణం చేసిన వాడికి సి.బి. ఐ వాళ్ళు ఉండేలా చూసుకుంటారు ... ఇది ఆక్షన్ ని
కలిగిస్తూ టెన్షన్ కి గురి చేస్తుంది .. హీరో ని పట్టుకున్టారేమో? హీరో
దొరికిపోతాడెమో? అనే టెన్షన్ ప్రేక్షకుడి లో కల్గిస్తుంది .. ఇది కుడా పద్ధతి గా చూపాలి ..
మొదటి దొంగతనం మాములుగా చూపాలి .. రెండవ దానిలో పోలీస్ పట్టుకోవడం ఫెయిల్ అవ్వాలి
... మూడవ దానిలో సమానం గా జరుగుతూ హీరో / పోలీస్ సగం సగం గెలవాలి ... చివరిదానిలో
పోలీస్ ని పక్కనే పెట్టుకుని దొంగతనం చేయాలి. ... ఈ ప్లే "జెంటిల్ మాన్"
లోకూడా వుంది ... "డాన్" లో వుంది ...
5. ఒక సహజ
విరుద్ధమయిన పాత్రని సృష్టిస్తే .. దాన్ని ఒప్పించేలా సీన్ లు, లాజిక్ లు పెట్టి
.. సినిమాని నమ్మించాలి ... అప్పుడే సినిమా రక్తి కడుతుంది ... "కిక్"
రవితేజా క్యారెక్టర్ బయట వుండదు ... వుంటే ఏమి చేస్తాడు? అప్పుడు అతని ని
ప్రేమించే ప్రియురాలు ఎలా వీడ్ని ఇబ్బంది పెడుతుంది? క్యారెక్టర్ తెలిస్తే ---
తెలియకపోతే .. వాడి ఇంట్లో వాళ్ళు ఎలా వుంటారు? . ఇలా ఆలోచిస్తూ సీన్ లు
వేసుకున్నారు .. కామెడీ కోసం డ్రైవ్ లు వాడుకున్నారు ... అవి సినిమా ని నవ్వుల్లో
ముంచెత్తు తాయి .....
6.Drive -1,2 : ఫస్ట్ హాఫ్ లో బ్రహ్మానందం -హల్వా రాజ్ సినిమాకి మంచి డ్రైవ్ ..అలాగే సెకండ్ హాఫ్ అలీ
-లీ క్యారెక్టర్ తో కుడా మంచి డ్రైవ్ ..ఇలాంటివి సృష్టించారు కాబట్టీ కధ రెండు
పార్ట్శ్ లలో కొత్తగా వుంది ...ఫస్ట్ హాఫ్ లో ఇలియానా -బ్రహ్మానందం ని అడ్డు
పెట్టుజుని రవితేజాని ఎదిపిస్తే ..సెకండ్ హాఫ్ లో లీ ని అడ్డు పెట్టుకుని రవితేజా
ఇలియానా ని ఏడిపిస్తాడు ...ఆక్షన్-రే ఆక్షన్ లు కరెక్ట్ గా వున్నాయి
7.Scenes : సీన్ లలో కుడా సప్రైజ్ లు వున్నాయి .. ఇలాంటివి ప్రేక్షకుడు ఉహించ లేడు ..
కాబట్టి బాగా అలరిస్తాయి ... సీన్ లో ప్రేక్షకుడు
ఊహించింది జరగ కూడదు ... అలావుంటే చాలు .. ప్రేక్షకుడు త్రిల్ ఫీల్ అవుతాడు ...
సీన్ లు వేసే టప్పుడు ఇదే లాజిక్ పని చేయాలి ...
8.Character Establishment : వేణుమాధవ్ పెళ్లి సీన్ తో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అవుతుంది
..తనే ప్లాన్ వేసి ..తనే లీక్ చేసి ...అందరినీ ఇబ్బంది పెట్టి ..ఆనందిస్తాడు
..ఎందుకంటే "కిక్" కోసం అంటాడు.ఈ ఒక్క సీన్ తో క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ బాగా చేసారు
....అలాగే Animation A తో వేణుమాధవ్ “రవితేజా పుట్టినప్పటి నుండి చెప్పడం” కొత్తగా వుంది..
9. తిక్కగా వుండే క్యారెక్టర్ మంచి చేస్తే ప్రేక్షకుడు ఆ క్యారెక్టర్ ని ఇష్టపడతాడు .. మిస్సమ్మ లో భూమిక .. మావిచిగురు లో ఆమని ... ఇలాంటి క్యారెక్టర్ లే ...
10. ప్రేక్షకుడుకి మెయిన్ క్యారెక్టర్ నచ్చాలి .. ఆ క్యారెక్టర్ నచ్చిందా .. అంతే వాడితో పాటు ట్రావెల్ మొదలు పెడతాడు ... 3 ఇడియట్స్ .. బొమ్మరిల్లు .. మున్నాభాయ్ .. శంకరాభరణం ... ఇలాంటివే ...
11. కధ ఎవడిదో .. కదా విస్తరణ కుడా వాడిమీదే జరగాలి ... ఇది కమర్షియల్ సినిమా రూల్ ... కాబట్టి హీరో మెయిన్ క్యారెక్టర్ కాబట్టి .. రవితేజా క్యారెక్టర్ మీదే కధ విస్తరణ జరిగింది ... చివరకు ఆ క్యారెక్టర్ ప్రకారమే కధ నడుస్తుంది ... "కిక్" కోసం రకరకాల జాబ్స్ చేస్తాడు .. మానేస్తాడు .. ఇలియానా ని ప్రేమిస్తాడు ... కానీ "కిక్" ని నిలబెట్టుకోవడం కోసం ప్రేమ ను కాదనుకుంటాడు ... అలాగే "కిక్" కోసం దొంగ అవుతాడు ... చివరిగా పోలీస్ అవ్వడం కుడా "కిక్" లో బాగమే ...
12. ధూమ్, సూపర్ సినిమాలు కుడా ఇలాంటివే కానీ ...
వాళ్ళు డబ్బుని సమాజ సేవకు ఉపయోగించరు .. దాని వలన సినిమా ని సామాన్య ప్రేక్షకుడు మెచ్చడు ...
ఆ కధలు గుర్తుకుడా వుండవు .. కేవలం పాటలే గుర్తుంటాయి ... అదే "జెంటిల్ మాన్"
"కిక్" సినిమాలు గుర్తుంటాయి. ... ఒకటి సీరియస్ - ఇంకొకటి కామెడీ ... అంతే తేడా ..
13.Screenplay : ఇలియానా - శ్యాం పెళ్లి చూపులు ట్రైన్ లో స్టార్ట్ చేసి ...
ఇలియానా ఫ్లాష్ బ్యాక్ గా ఒక ఎపిసోడ్ .. శ్యాం ఫ్లాష్ బ్యాక్ గా రెండవ ఎపిసోడ్ చెబుతారు ... డైరెక్టర్ పాయింట్ అఫ్ వ్యూ లో సినిమా స్టార్ట్ అయ్యి ...
క్యారెక్టర్ ల పాయింట్ అఫ్ వ్యూ లో నడిచి .. ఇంటర్వెల్ కి ప్రెసెంట్ లోకి వస్తుంది ... సెకండ్ హాఫ్ అంతా డైరెక్టర్ పాయింట్ అఫ్ వ్యూ తో నడుస్తుంది ....